యూపీఐ లావాదేవీలపై కొత్త ఛార్జీల వడ్డన నిజమేనా కస్టమర్లు తెలుసుకోవాల్సిన అసలు నిజాలు

రిపోర్టర్: అశోక్ స్థలం: India

యూపీఐ పేమెంట్స్‌పై అక్టోబర్ 15 నుంచి రూ.రెండు వేలకు మించిన మర్చంట్ లావాదేవీలపై జీరో పాయింట్ ఫోర్ శాతం ఎండీఆర్ వర్తించనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఛార్జీలను సాధారణ కస్టమర్లు చెల్లించాల్సిన అవసరం లేదని, ఇది పూర్తిగా వ్యాపారులకు సంబంధించిన విధానమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దుకాణదారులు ఎవరైనా యూపీఐ ఛార్జీల పేరుతో అదనపు డబ్బులు వసూలు చేస్తే కస్టమర్లు బిల్లు వివరాలతో ప్రశ్నించవచ్చని హెచ్చరిస్తున్నారు.