రామ్ చరణ్ సినిమాపై సుకుమార్ సతీమణి తబిత ఆసక్తికర పోస్ట్

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

మెగా హీరో రామ్ చరణ్ తో పాటు ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆర్సీ 17 సినిమాపై సుకుమార్ భార్య తబిత సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పట్ల తనకు ఎంతో గర్వంగా ఉందని, మరోసారి ఆ మ్యాజిక్ పునరావృతం కానుందని ఆమె పేర్కొంటూ అభిమానులతో ఆ వీడియోను పంచుకున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.