కొత్త కెరీర్ నిర్ణయంపై వీరేంద్ర సెహ్వ కుమారుల తీవ్ర ఆందోళన
రిపోర్టర్: సతీష్
స్థలం: న్యూఢిల్లీ
రియాల్టీ షోకు హోస్ట్‌గా వ్యవహరించాలన్న తన నిర్ణయంపై కుమారులు ఆందోళన వ్యక్తం చేశారని ప్రముఖ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వ వెల్లడించారు. వివాదాలు మరియు ఘర్షణలతో కూడిన రియాల్టీ షోలలో పాల్గొంటే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వస్తుందని తన కుమారులు ఆర్యవీర్, వేదాంత్ భయపడినట్లు ఆయన తెలిపారు. అయితే విభిన్న రంగాలను అన్వేషించాలనే ఉద్దేశంతోనే తాను 'రైజ్ అండ్ ఫాల్ సీజన్ 2' షోను హోస్ట్ చేయడానికి అంగీకరించినట్లు సెహ్వగ్ స్పష్టం చేశారు.