యాషెస్ సిరీస్‌పై స్పష్టతనివ్వని ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్

రిపోర్టర్: హరి స్థలం: World

వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే యాషెస్ సిరీస్‌లో తాను ఆడటంపై ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ సందిగ్ధత వ్యక్తం చేశాడు. ప్రస్తుతం సిరీస్‌ల వారీగా మాత్రమే ఆలోచిస్తున్నానని, భవిష్యత్తు గురించి ఇప్పుడే చెప్పలేనని స్పష్టం చేశాడు. అయితే లాస్‌ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో మాత్రం టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ ఆడాలనే కోరిక ఉందని స్మిత్ వెల్లడించాడు.