ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో చేపడుతున్న ప్రత్యేక సార్వత్రిక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, డిప్యూటీ కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ లో భాగంగా జారీ చేసే నోటీసులు, విచారణకు బూత్ లెవెల్ ఏజెంట్లు సహకరించాలని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.