హైదరాబాద్లో దారుణం: బొల్లారం చిన్నారి హత్య కేసులో నిందితుడు అరెస్ట్

రిపోర్టర్: సునీల్ స్థలం: Hyderabad

బొల్లారంలోని క్లబ్హౌస్ సెల్లార్లోని సంపులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించినట్లు మల్కాజిగిరి సీపీ సుమతి వెల్లడించారు. సెక్యూరిటీ గార్డుగా పనిచేసి మానేసిన విక్రమ్కుమార్ చిన్నారిని కిడ్నాప్ చేసి రూ.20 లక్షలు డిమాండ్ చేయాలని భావించి ఈ హత్యకు పాల్పడ్డాడని ఆమె తెలిపారు. ఈ ఘటనతో అపార్ట్మెంట్లలో పిల్లల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతుండగా, పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.