పులివెందులలో జగన్ కాన్వాయ్ అడ్డుకున్న షేక్ దస్తగిరి: కలకలం సృష్టించిన ఘటన

రిపోర్టర్: రమేష్ స్థలం: పులివెందుల

పులివెందుల పర్యటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ ను వివేకా హత్య కేసు నిందితుడు షేక్ దస్తగిరి అడ్డుకోవడం తీవ్ర కలకలం రేపింది అని పోలీసులు తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ లో ఓటు హక్ కు వినియోగించుకోవడానికి వచ్చిన జగన్ వాహనానికి ఎదురుగా దస్తగిరి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేయడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై వెంటనే అతడిని అక్కడి నుంచి పంపించివేశారు అని అధికారులు వెల్లడించారు.