మత స్వేచ్ఛ పరిరక్షణకు రాజ్యాంగబద్ధంగా పోరాడాలన్న మౌలానా మహమూద్ మదానీ
రిపోర్టర్: మహేష్
స్థలం: న్యూఢిల్లీ
న్యూఢిల్లీలో జమియత్ ఉలేమా-ఎ-హింద్ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. జమియత్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ మదానీ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో రాజ్యాంగ హక్కులు, మత స్వేచ్ఛ, మసీదులు, మదర్సాల కూల్చివేతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మైనారిటీల హక్కులకు భంగం కలుగుతోందని, ఈ సమస్యలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ముస్లింలు భయపడకుండా రాజ్యాంగబద్ధమైన మార్గాల్లో హక్కుల సాధనకోసం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.