భక్తిశ్రద్ధలతో వినాయకునికి లక్ష పుష్పార్చన

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండల కేంద్రంలోని శ్రీరామకృష్ణ సాయి మందిరంలో ప్రతిష్ఠించిన వినాయకునికి ఐదవ రోజైన శుక్రవారం లక్ష పుష్పార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద బ్రాహ్మణులు ప్రత్యేక అర్చనలు చేసి, భక్తులకు మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం అందజేశారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను ఘనంగా పంపిణీ చేశారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో రామకృష్ణ సాయి మందిర భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దైవ కృపకు పాత్రులయ్యారు.