ఢిల్లీలో కలకలం: సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే ముందస్తు అరెస్ట్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ఢిల్లీ
కాక్రోచ్ జనతా పార్టీ కన్వీనర్ అభిజిత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఆయన నివాసంలో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పార్టీ పిలుపునిచ్చిన తిరంగా ర్యాలీకి బయలుదేరడానికి కొద్ది నిమిషాల ముందే పోలీసులు ఈ చర్య చేపట్టారు. రాజధానిలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకే ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. అనుమతులు లేవని హెచ్చరిస్తూ ఆయన్ను స్టేషన్కు తరలించడంతో రాజకీయ వర్గాలలో తీవ్ర కలకలం రేగింది.