ఈసీఐ నిర్ణయంపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిప్పులు
రిపోర్టర్: విజయ్
స్థలం: న్యూఢిల్లీ
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఆన్లైన్ ఫారం ఆరు మార్పులపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారం ఆరును చట్టవిరుద్ధంగా మార్చారంటూ ఎక్స్ వేదికగా ఆయన మండిపడ్డారు. ఈసీఐలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు ఆ మార్పులు చేయమని ఎవరు ఆదేశాలు ఇచ్చారని, టీసీఎస్‌లో ఎవరు దానికి ఆమోదం తెలిపారంటూ రాహుల్ గాంధీ నిలదీశారు. ఈ వివాదంపై ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.