'ది వాన్' ట్రైలర్ విడుదల: సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా మూవీపై భారీ అంచనాలు
రిపోర్టర్: హరి
స్థలం: India
స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం 'ది వాన్' అధికారిక ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. బాలాజీ మోషన్ పిక్చర్స్ మరియు టీవీఎఫ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పురాతన నమ్మకాలు, దైవిక శక్తుల ఆధారంగా సాగుతోంది. సునీల్ గ్రోవర్, మనీష్ పాల్, శ్వేతా తివారీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.