విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర: మంత్రి కొండపల్లి

రిపోర్టర్: శివ స్థలం: విజయనగరం

విజయనగరంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 90 మందిని మంత్రి, కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఘనంగా సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు.