ప్రజారోగ్య శాఖ ఇంచార్జి సంచాలకులుగా డాక్టర్ వెంకటరమణ నియామకం
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇన్ఛార్జి సంచాలకులుగా డాక్టర్ ఆర్.వెంకటరమణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. డీపీహెచ్ డాక్టర్ పద్మావతి పదవీ విరమణ పొందడంతో ఈ నియామకం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వైద్య విద్య శాఖ పరిధిలో పదోన్నతి పొందిన తొమ్మిది మందికి జీజీహెచ్లు, వైద్యకళాశాలల్లో సూపరింటెండెంట్లు, ప్రిన్సిపల్స్గా పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.