గాయపడిన సింగరేణి కార్మికుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

కాసిపేట రెండు ఇంక్లైన్ గని ప్రమాదంలో గాయపడిన సింగరేణి కార్మికులను బెల్లంపల్లి పట్టణంలోని వారి నివాసాలకు వెళ్లి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి సోమవారం పరామర్శించారు. కార్మికుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందేలా అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దావ స్వాతి రమేష్ బాబు, పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్, స్థానిక కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.