వినాయక చవితి పర్వదినాన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన విద్యాసాగర్

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని పిలుపునిచ్చారు. పండుగను ఆనందంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.