ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో పులకించిన కాంగ్రెస్ శ్రేణులు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అధ్యక్షుడు బండి ప్రభాకర్ నేతృత్వంలో పార్టీ నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు.