డెస్టినీ కన్సల్టెన్సీ మోసం కేసులో యూట్యూబర్ రమానందన విచారణ

రిపోర్టర్: సతీష్ స్థలం: NTR District

లండన్ కన్సల్టెన్సీ పేరుతో విదేశీ ఉద్యోగాల ఆశ చూపి డబ్బు వసూలు చేసిన కేసులో యూట్యూబర్ రమానందన ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కన్సల్టెన్సీ వ్యవహారాలన్నీ తన భర్త మధుకర్ చూసుకుంటారని, తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె పోలీసుల ముందు స్పష్టం చేశారు. సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో ఈ నెల 16న మళ్లీ విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.