అనారోగ్యంతో బాధపడుతున్న ఆటో కార్మికుడికి మమత యూనియన్ ఆర్థిక భరోసా
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
అనారోగ్యంతో బాధపడుతూ మంచాన పడిన మమత హాస్పిటల్ ఏఐటీయూసీ సభ్యుడు కే. భాస్కర్‌కు మమత ఆటో యూనియన్ సభ్యులు మానవతా దృక్పథంతో ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కానాపురం హవేలీ శాఖ కార్యదర్శి ఏనుగు గాంధీతో పాటు పలువురు యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొని బాధితునికి అండగా నిలుస్తామని భరోసానిచ్చారు.