డెమొక్రాట్లకు జోహ్రాన్ మమ్దాని కీలక సందేశం: రాజకీయ విజయాలే సర్వస్వం కాదని స్పష్టీకరణ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: న్యూయార్క్

డెమొక్రాట్లు సాధించిన ఎన్నికల విజయాలు ప్రజల జీవితాల్ లో నిజమైన మార్పు తీసుకురావాలని న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దాని స్పష్టం చేశారు. మధ్యంతర ఎన్నికల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేవలం అధికారంలోకి రావడం సరిపోదని, సాధారణ ప్రజలకు మెరుగైన ఫలితాలు అందించి నమ్మకం కలిగించాలని తెలిపారు. టెక్సాస్ లో జేమ్స్ తలారికో సాధించిన విజయం ప్రజల ఆకాంక్షలకు నిదర్శనమని పేర్కొంటూ డెమొక్రాట్ పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.