ఆదివాసీ ప్రాంత అభివృద్ధి నిధులను రాజకీయ నేతలే దోచుకుంటున్నారన్న అశోక్లాల్
రిపోర్టర్: నేతల ప్రసాద్ బాబు
స్థలం: కొయ్యూరు
ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు అనేక సమస్యలతో సతమతమవుతున్నప్పటికీ పాలకులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని కొయ్యూరు మండల ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడు ఎస్. అశోక్లాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శించారు. నిధులను రాజకీయ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు.