వైభవ్ సూర్యవంశీపై బౌన్స్ పిచ్‌లతో పదునైన అస్త్రాలు ప్రయోగిస్తాం
రిపోర్టర్: హరి
స్థలం: తెలంగాణ
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని న్యూజిలాండ్ వేగవంతమైన పిచ్‌లపై పరీక్షించేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆ జట్టు హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ తెలిపారు. అక్టోబర్ 22 నుండి భారత్, న్యూజిలాండ్ మధ్య ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కీవీస్ బౌలర్లు విసిరే పదునైన బౌన్సర్లు, స్వింగ్‌ను వైభవ్ ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారిందని రాబ్ వాల్టర్ పేర్కొన్నారు.