వైభవంగా ఏఎస్‌పేట దర్గా గంధ మహోత్సవం

రిపోర్టర్: సురేష్ స్థలం: ఎస్పీ నెల్లూరు

ఏఎస్‌పేటలోని ప్రసిద్ధ హజరత్‌ సయ్యద్‌ ఖాజా రహ్మతుల్లా నాయబ్‌ రసూల్‌ దర్గా గంధ మహోత్సవం వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో దర్గా కిక్కిరిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు గంధం ఎత్తే కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు 200 కిలోల గంధం పంపిణీ చేయనున్నారు. భద్రత కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.