రాండి ఆర్టన్‌పై డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ కోడి రోడ్స్ తీవ్ర హెచ్చరిక

రిపోర్టర్: శివ స్థలం: World

డబ్ల్యూడబ్ల్యూఈ స్మాక్‌డౌన్ కార్యక్రమంలో భాగంగా ప్రసారం కాని ఓ వీడియోలో రెజ్లర్ కోడి రోడ్స్ రాండి ఆర్టన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సండే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో ఆర్టన్ చేతిలో ఓటమి పాలైన కోడి రోడ్స్, మై కోల్‌తో జరిగిన ఇంటర్వ్యూ తర్వాత కెమెరాలు ఆపేసిన సమయంలో ఆర్టన్‌ను ఉద్దేశించి ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. మళ్లీ అవకాశం వస్తే ఆర్టన్ అంతు తేలుస్తానని ఆయన హెచ్చరించినట్లు ట్రిపుల్ హెచ్ సోషల్ మీడియాలో వెల్లడించారు.