ఘోరం: భర్తను చంపి పాము కాటుగా చిత్రీకరించిన భార్యకు మరణశిక్ష
రిపోర్టర్: మహేష్
స్థలం: మీరట్
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో భర్త అమిత్ కశ్యప్ హత్య కేసులో భార్య రవిత, ఆమె ప్రియుడు అమర్ దీప్ లకు కోర్టు మరణశిక్ష విధించినట్లు ప్రభుత్వ న్యాయవాది ఫర్జానా మక్బూద్ తెలిపారు. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే కక్షతో భర్తను గొంతు నులిమి చంపి, మృతదేహం వద్ద సజీవ పామును ఉంచి పాము కాటుగా చిత్రీకరించాలని చూసిన ఈ కిరాతక ఘటనపై అదనపు జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది.