గర్భధారణ కాలంపై గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి కీలక వివరణ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
గర్భధారణ కాలం తొమ్మిది నెలలా లేక నలభై వారాలా అనే అంశంపై గ్లెనెగల్స్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి బి స్పష్టతనిచ్చారు. చివరి బహిష్టు మొదటి రోజు నుంచి లెక్కించడం వల్లే నలభై వారాలు వస్తుందని, ఇది తొమ్మిది నెలల ఒక వారానికి సమానమని ఆమె తెలిపారు. డెలివరీ గడువు అనేది కేవలం అంచనా తేదీ మాత్రమేనని, నలభై వారాలు దాటితే వైద్యుల పర్యవేక్షణ అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు.