భూ రికార్డ్ ల మార్పుల కలకలం: తహసీల్దార్ సస్పెన్షన్
రిపోర్టర్: సురేష్
స్థలం: Nagarkurnool
నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లిలో నరుము కోట్ల విలువైన భూ రికార్డుల మార్పు వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిన అనంతరం తహసీల్దార్ సునీతను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారని అధికారులు తెలిపారు. పాత ఖాస్రా రికార్డులకు విరుద్ధంగా సంబంధంలేని వ్యక్తుల పేర్లపై భూమి నమోదు కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.