'అప్పుల బాధతో కఠిన నిర్ణయం': ఎన్టీఆర్ జిల్లాలో రైతు ఆత్మహత్య

రిపోర్టర్: సునీల్ స్థలం: ఎన్టీఆర్ జిల్లా

అప్పుల బాధ, కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనరసాపురం గ్రామానికి చెందిన రైతు పుసులూరి శ్రీనివాసరావు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామంలో తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటనలో తండ్రి శ్రీనివాసరావు, కుమార్తె లాస్య మృతి చెందగా, తీవ్ర అస్వస్థతకు గురైన కుమారుడు నిఖిల్ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడం, పంటలు నష్టపోవడంతో అప్పుల ఊబిలో కూరుపోయి శ్రీనివాసరావు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.