నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆకస్మిక తనిఖీ
రిపోర్టర్: హరి
స్థలం: కర్నూలు
కర్నూలు వెంకటరమణ కాలనీలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మేయర్ నామినేషన్ కేంద్రాన్ని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేస్తూ తగిన ఆదేశాలు జారీ చేశారు.