వినాయక విగ్రహాల ఏర్పాటుకు ఇక సింగిల్ విండో అనుమతులు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Andhra Pradesh
గణేష్ ఉత్సవ కమిటీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విగ్రహాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సులభతరం చేస్తూ 'సింగిల్ విండో' విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. నిర్వాహకులు ఇకపై ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ganeshutsav.net పోర్టల్ ద్వారా పోలీస్, ఫైర్, విద్యుత్ మరియు మున్సిపల్ శాఖల అనుమతులను ఒకే చోట ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని వేగంగా పొందవచ్చు.