ఐలమ్మ జయంతి ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్గా పెండ్యాల మహేష్
రిపోర్టర్: SK
స్థలం: పెద్దపల్లి
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి ఉత్సవ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్గా పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేటకు చెందిన పెండ్యాల మహేష్ నియమితులయ్యారు. ఈ బాధ్యతలను అప్పగించినందుకు మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ విజయరమణారావు, ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రేపు రవీంద్రభారతిలో జరగనున్న జయంతి వేడుకలను అందరూ కలిసి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.