స్థానిక సంస్థల ఎన్నికల భద్రతపై శ్రీ సత్యసాయి జిల్లా పోలీసుల ప్రత్యేక దృష్టి

రిపోర్టర్: విజయ్ స్థలం: శ్రీ సత్యసాయి

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు శ్రీ సత్యసాయి పోలీస్ వెల్లడించారు. ఇందులో భాగంగా కోడూరు గార్మెంట్ యూనిట్లో కార్మికులకు ఎన్నికల అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఎలాంటి అపోహలకు తావులేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా పోలీసు యంత్రాంగం స్పష్టం చేసింది.