భారత్ తో వన్డే సిరీస్ కు దూరం: కివీస్ కు బిగ్ షాక్ ఇచ్చిన గాయాలు

రిపోర్టర్: సతీష్ స్థలం: ఆక్లాండ్

భారత్ తో జరిగే ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ కు కీలక ఆటగాళ్లు మార్క్ చాప్మన్, రచిన్ రవీంద్ర దూరమయ్యారని న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ తెలిపారు. హ్యామ్స్ట్రింగ్, భుజం గాయాల కారణంగా ఈ ఇద్దరూ సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండరని ఆయన స్పష్టం చేశారు. స్వదేశంలో టీమిండియాతో తలపడనున్న కివీస్ జట్టుకు ఇది గట్టి ఎదురుదెబ్బ అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.