స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ కీలక సమీక్ష: నేతలకు దిశానిర్దేశం
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారని వైఎస్సార్సీపీ వర్గాలు తెలిపాయి. గెలుపే లక్ష్యంగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని, అధికార పార్టీ విధానాలను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.