విశ్రాంత ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి
రిపోర్టర్: రాజేష్
స్థలం: విజయవాడ
అమెరికాలో కన్నుమూసిన విశ్రాంత ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన సేవలు నిరుపమానమని, లా అండ్ ఆర్డర్ విషయంలో ఎప్పుడూ రాజీపడలేదని చంద్రబాబు కొనియాడారు. విజయవాడ నగరంలోని పోలీసు మైదానంలో ఉంచిన భౌతికకాయం వద్ద కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పున్నమిఘాట్ సమీపంలో పోలీసు లాంఛనాలతో బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ముగిశాయని తెలిపారు.