హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఫ్లాట్ల దరఖాస్తు గడువు పెంపు

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌ నగరంలో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఫ్లాట్ల దరఖాస్తు గడువును ప్రభుత్వం మరో ఐదు రోజులు పొడిగించింది. ఎల్బీనగర్, గోషామహల్, చాంద్రాయణగుట్ట, ముషీరాబాద్ నియోజకవర్గాల అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసక్తి గల అర్హులు ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు.