కోడలి జీతంలో పావు వంతు అత్తకు ఇవ్వాలని రాజస్థాన్ హైకోర్టు తీర్పు

రిపోర్టర్: సునీల్ స్థలం: రాజస్థాన్

భర్త మరణాంతరం కారుణ్య నియామకం పొంది మరో వివాహం చేసుకుని అత్తను పట్టించుకోని కోడలి వ్యవహారంలో రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అజ్మీర్ విద్యుత్ వితరణ ని లిమిటెడ్ లో లోయర్ డివిజన్ క్లర్క్ గా పనిచేస్తున్న ఆ మహిళ నెలసరి జీతంలో 25 శాతాన్ని ఆమె వృద్ధ అత్తగారికి అందజేయాలని ఆదేశించింది. అంతేకాకుండా, మృతి చెందిన ఉద్యోగి టెర్మినల్ బెనిఫిట్స్ లో సగం తల్లికి చెల్లించాలని స్పష్టం చేసింది.