రేవంత్ చిల్లర మాటలకు బెదరం కేటీఆర్ ఫైర్

రిపోర్టర్: మహేష్ స్థలం: Hyderabad

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై ఏండ్లుగా దుష్ప్రచారం చేసి, ఇప్పుడు 67 ఎకరాలేనని అసెంబ్లీలో ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. మీకు ధైర్యముంటే సుప్రీంకోర్టు సీజేకు లేఖ రాయాలని, కేసీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎనిమిది వేల ఎకరాలు కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు.