అమెరికాలో వైభవంగా దసరా వేడుకలు: భారతీయ కమ్యూనిటీకి సెనేటర్ కోరీ బుకర్ శుభాకాంక్షలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: New Jersey
అమెరికాలోని న్యూజెర్సీ ప్రాంతంలో ఘనంగా జరుగుతున్న దసరా మరియు నవరాత్రి వేడుకలపై యూఎస్ సెనేటర్ కోరీ బుకర్ హర్షం వ్యక్తం చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి నవరాత్రులు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. వలస కుటుంబాల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో జీవన వ్యయం పెరిగిపోవడంపై సెనేటర్ బుకర్ స్పందిస్తూ, కష్టాలను ఎదుర్కొనేందుకు ప్రజలు ఐక్యంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.