కదలికలు, గాలితో విద్యుత్ ఉత్పత్తి చేసే టెంట్ రూపకల్పన

రిపోర్టర్: గోపి స్థలం: World

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కదలికలు, గాలి మరియు వర్షపు నీటి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సరికొత్త టెంట్‌ను అభివృద్ధి చేశారు. మాగ్నెటోఎలాస్టిక్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసిన ఈ టెంట్ ద్వారా తాత్కాలిక ఆశ్రయాల్లో ఉండేవారు, నిరాశ్రయులు మొబైల్ ఛార్జింగ్, లైటింగ్ వంటి చిన్న అవసరాలకు గ్రిడ్ తో సంబంధం లేకుండా విద్యుత్ పొందవచ్చని పరిశోధకులు తెలిపారు.