మురసు తుపాను బీభత్సం: రాష్ట్రంలో నలుగురు దుర్మరణం, అస్తవ్యస్తం జనజీవనం

రిపోర్టర్: విజయ్ స్థలం: బాపట్ల

మురసు తుపాను ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపడంతో నలుగురు మృతి చెందారని, భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్ లో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. బాపట్ల జిల్లాలో ముగ్గురు, గుంటూరులో ఒకరు ప్రాణాలు కోల్పోయారని, పలువురు గల్లంతు కావడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశామని ఆయన తెలిపారు. విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్న ప్రాంతాల్ లో పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం హెచ్చరించారు.