సముద్రంలో చిక్కుకున్న సింగపూర్ నౌక: ఇరవై మంది సిబ్బందిని రక్షించిన కోస్ట్ గార్డ్

రిపోర్టర్: నరేష్ స్థలం: విశాఖపట్నం

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ తుపాను ధాటికి సముద్రంలో ఇంజిన్ పాడై చిక్కుకుపోయిన సింగపూర్ కార్గో నౌక సిబ్బందిని భారత కోస్ట్ గార్డ్ సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుంచి బయలుదేరిన సిగ్మా పెర్ల్ నౌక ఇంజిన్ ఫెయిల్ కావడంతో అర్ధంతరంగా నిలిచిపోయింది. కేజీ బేసిన్ సమీపంలో ఎదురైన ఈ ప్రమాదం నుంచి ఇరవై మంది సిబ్బందిని సుజయ్ నౌక ద్వారా సురక్షితంగా కాపాడినట్లు తీర రక్షణ దళం వెల్లడించింది.