బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
రిపోర్టర్: సురేష్
స్థలం: విశాఖపట్నం
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో సెప్టెంబర్ 20 లేదా 21 నాటికి వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం నుంచి బుధవారం వరకు ఉత్తరాంధ్ర మరియు కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయనున్నాయని హెచ్చరించారు.