చేజర్ల మండలం గొల్లపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేసిన ఆనం రామనారాయణ రెడ్డి
రిపోర్టర్: సునీల్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం గొల్లపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు లబ్ధిదారుల ఇంటి వద్దకే స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం మెరుగైన సంక్షేమ ఫలాలను అందిస్తోందని వెల్లడించారు.