రూ.18 వేల వేతనం ఇవ్వాలి అంగన్వాడీల పెండింగ్ బకాయిలు చెల్లించాలి.. 9న ఇందిరాపార్క్‌లో ధర్నా
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా ఆదివారం తాండూర్ మండలంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రీ, ప్రైమరీ, పీఎం శ్రీ కేంద్రాలతో కలిపి మొత్తం 4,131 కేంద్రాలను రద్దు చేసి వాటిని అంగన్వాడీలకు అప్పగించాలని కోరారు. ఐసీడీఎస్‌కు నిధులు పెంచి బలోపేతం చేయాలని, అంగన్వాడీ సిబ్బందికి ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.18 వేల వేతనం వెంటనే నిర్ణయించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అబ్బోజు రమణ, కార్యదర్శి దుంపల రంజిత్‌కుమార్ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 9న ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.