'అక్రమ మట్టి రవాణాకు ఇదే సాక్ష్యం': విజయవాడలో లారీ దగ్ధం
రిపోర్టర్: మహేష్
స్థలం: NTR District
విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లిలో మట్టి లోడ్‌తో వెళ్తున్న ఓ లారీకి 11 కేవీ విద్యుత్ హైటెన్షన్ వైర్లు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా సాగుతున్న ఈ మట్టి రవాణా వల్ల దట్టమైన పొగలు అలుముకుని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ డ్రైవర్ ప్రాణాలతో బయటపడటంతో పాటు ఆ సమయంలో జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలనుార్పగా, అక్రమ రవాణాపై అధికారులు ఇప్పటికైనా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.