తెల్లకాగితం చిత్రం నుంచి తెలుసా తెలుసా పాట విడుదల

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న తెల్లకాగితం సినిమాలోని తెలుసా తెలుసా మొదటి పాటను విడుదల చేశారు. విజయ్ దేవరకొండ ఈ పాటను సామాజిక మాధ్యమాలలో పంచుకుని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ మెలోడీ పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటూ సంగీత ప్రియుల హృదయాలను కొల్లగొడుతోంది.