నంద్యాల కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని బలవన్మరణంపై వైఎస్సార్సీపీ మండిపాటు

రిపోర్టర్: నరేష్ స్థలం: నంద్యాల

నంద్యాల జిల్లా కొత్తపల్లి కస్తూర్బా పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. విద్యార్థినుల మధ్య వివాదం కారణంగా హాస్టల్ గదిలో ఆమె రసాయనాలు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. విద్యార్థుల మధ్య గొడవ జరుగుతుంటే సిబ్బంది ఏం చేస్తున్నారని, ఇదేనా మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణ అంటూ పార్టీ వర్గాలు నిలదీశాయి.