నాంపల్లిలో ఫ్లోరోసిస్ ఆవాసాల పరిశీలన: జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక బృందం పర్యటన
రిపోర్టర్: హరి
స్థలం: నాంపల్లి
నాంపల్లి మండలం రాందాస్ తండాలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక పరిశీలకుడు డాక్టర్ అనిమేష్ భట్టాచార్య బుధవారం పర్యటించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి, మిషన్ భగీరథ నీటి సరఫరా తీరుపై ఆయన ఆరా తీశారు. స్థానిక ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న తాగునీటి నాణ్యతను పరిశీలించారు. శుద్ధ జలాలు ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయని గ్రామస్థులను అడిగి తెలుసుకున్నట్లు అధికారులు తెలిపారు.