డోలీ మోతలతో ఆసుపత్రికి వెళ్లిన వృద్ధుడు మృతి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: పార్వతీపురం మన్యం

పార్వతీపురం మన్యం జిల్లా మెంటాడ మండలం కొండపర్తి బాడవకు చెందిన అంజి సీతందొర తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చంపావతి నదిని తెప్పపై దాటించి, డోలీపై మోసుకుంటూ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన ప్రాణాలు దక్కలేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గజపతినగరం ఏరియా ఆసుపత్రి వైద్యులు ఆయన్ను చేర్చుకోకుండానే వెనక్కి పంపడం వల్లే చనిపోయాడని ఆయన భార్య బుచ్చమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై వైద్యుల స్పందన భిన్నంగా ఉంది.